పుట:కాశీఖండము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక 17

మ. కలపుంస్కోకిలకంఠకోమలకుహూకారస్పురత్పంచమ
స్ఖల[1]వద్వశ్యములైన కాలముల మార్కండేయనాథేశ్వరున్
లలితోరస్కుఁడు వీరభూపతి వసంతం బాడు నీవీటివీ
థులఁ గర్పూరహిమాంబుసంకుమదకస్తూరీపటీఠంబులన్. 59
 
ఉ. [2]ప్రాకటవిక్రమస్ఫురణ రాజమహేంద్రము రాజధానిగా
నేకసితాతపత్త్రమున నేలెను వీరనృపాలుఁ డుత్తమ
శ్లోకుఁడు వేమశౌరియనుజుండు సమున్నతవైభవాఢ్యుఁడై
చీఁకటియున్ గళింగయును జిల్కసముద్రము సింహశైలమున్. 60

షష్ఠ్యంతములు

క ఈదృశగుణగణనిధికిని
వేదార్థకవిత్వతత్త్వవిధివత్పతికిన్
క్ష్మాదివిజకవిజనాశీ
ర్వాదప్రవితీర్యమాణవైభవనిధికిన్. 61

క. క్షురికాకరబేతాళున
కరిభయదభుజాపరాక్రమాభీలునకున్
శరణాగతకురుకేరళ
కురుభూపాలునకు జగదగోపాలునకున్. 62

క. అంభోధివలయితావని
సంభరణప్రౌఢనిజభుజాయుగయుగళీ
సంభావితకిటికచ్ఛప
కుంభీనససార్వభౌమకులకుధరునకున్. 63

క. వేమాధిపానుజునకును
రామామదనునకు ఘోడెరాయగురు శ్రీ

  1. దధ్వన్య, వద్వస్య, దుర్వస్య
  2. ఈపద్యము కొన్నిప్రతులలోఁ గన్పట్టదు.