పుట:కాశీఖండము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

231


వ.

అంత నక్కడ శనైశ్చరుండు వారాణసికిం జని లింగస్థాపనంబు చేసె. ఆశనైశ్చరేశ్వరుండు విశ్వేశ్వరదేవునకు దక్షిణభాగంబున శుక్రేశ్వరున కుత్తరంబున సంప్రతిష్ఠితుండై భజియించువారికి భోగమోక్షంబులు ప్రసాదించు. శనైశ్చరునకుఁ దత్ప్రసాదలబ్ధం బీలోకంబు. ఇది శనైశ్చరలోకవృత్తాంతంబు.

276


సప్తర్షిలోకవృత్తాంతము

క.

సప్తమహామునిలోకము
సప్తార్చిఃప్రతిమతేజ! సకలైశ్వర్యా
వాప్తికరం బిది చూడుము
ప్రాప్తాఖలవిద్య! భూసుపర్వవరేణ్యా!

277


వ.

మరీచి యత్రి పులస్త్యుండు పులహుండు క్రతు వంగిరసుండు వసిష్ఠుండు వీరు బ్రహ్మమానసపుత్రులు, సప్తబ్రహ్మలు. వీరికి ధర్మపత్నులు క్రమంబుగ సంభూతి యనసూయ క్షమ ప్రీతి సన్నతి స్మృతి [1]యూర్జ. వీరివలన నా ప్రజాపతులు నానారూపప్రజల సృజియించి బ్రహ్మాదేశంబున నయ్యవిముక్తక్షేత్రంబునఁ దపంబు చేసి మరీచ్యత్రీశ్వరాదిలింగంబులం బ్రతిష్ఠించిరి. సంభూత్యనసూయాదు లగు పతివ్రతలును దమపేర శివలింగంబులం బ్రతిష్ఠ చేసిరి. తత్ప్రసాదలబ్ధం బైన యీలోకంబున సప్తమహామునులును బరమసుఖం బనుభ

  1. ‘యక్ష’ యని పెక్కుప్రతులఁ గనఁబడుచున్నది. ఇది ‘సంభూతి రనసూయాచ క్షమా ప్రీతి శ్చసన్నతిః, స్మృతిరూర్జాక్రమాదేషాం పత్న్యో లోకస్య మాతరః’ అను మూలమునకు విరుద్ధము.
    అరుంధతి యని వేఱొక పా.