పుట:కాశీఖండము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 శ్రీకాశీఖండము

సచివసైన్యాధీశసామంతనృపవర
సీమంతినీజనశ్రేణి గొలువ
శాస్త్రమీమాంసయు సాహిత్యగోష్ఠియు
విద్వత్కవీంద్రులు విస్తరింపఁ
గర్పూరకస్తూరికాసంకుమదగంధ
సారసౌరభము దిక్పూరితముగ
తే. నిజభుజావిక్రమంబున నఖిలదిశలు
గెలిచి తను రాజ్యపీఠ మెక్కించినట్టి
యన్న వేమేశ్వరునిజాంక మాశ్రయించి
నిండుకొలు వుండెఁ గన్నులపండు వగుచు. 10

వ. అప్పుడు నన్నుం బిలువం బంచి సముచితాసనంబునం గూర్చుండ నియమించి యున్నయవసరంబున. 11

తే. రాయవేశ్యాభుజంగ సంగ్రామసార్థ
గాయిగోవాడ వేమనక్ష్మాధవుండు
గూర్మి యనుజన్ముహృదయంబుకోర్కి యెఱిఁగి
యర్థి ననుఁ జూచి యిట్లని యానతిచ్చె. 12

సీ. వచియింతు వేములవాడ భీమనభంగి
నుద్దండలీల నొక్కొక్కమాటు
భాషింతు నన్నయభట్టుమార్గంబున
నుభయవాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
వాకృత్తు తిక్కయజ్వప్రకారము రసా
భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిఠేవ
సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు