పుట:కాశీఖండము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 87

డయి చనియె నని చెప్పిన నైమిశారణ్యవాసు లటమీఁదివృత్తాంతం బెయ్యది యనుటయు. 164

ఆశ్వాసాంతము

ఉ. బలవద్బారహగొంతిమన్నెధరణిీపాలావరోధాంగనా
విలసన్మంగళసూత్రరక్షణకళావిఖ్యాతకారుణ్య! యు
త్కలకర్ణాటతురుష్కరాట్పరమమిత్రా! కుండలిస్వామికుం
డలపూజాపరతంత్రధీవిభవ! పంటక్ష్మాపచూడామణీ! 165

క. భూపాలమథన! జంబూ
ద్వీపేశ్వర! విమతరాయవేశ్యావిటధా
టీపటహడాన్నినాదా
టోపప్రక్షుభితదిక్కుడుంగక్రోడా! 166

ఉత్సాహ—
బంధులోకపారిజాత! పంటసంశపావనా!
సంధివిగ్రహప్రధానషడ్గుణా! విశారదా!
గంధవాహభుక్కలాపకంఠకోణనాభిని
ర్గ్రంధనక్రియామహాప్రగల్భకీర్తివైభవా! 167

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండం బనుమహాకావ్యంబునందు ద్వితీయాశ్వాసము.