పుట:కాశీఖండము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86 శ్రీకాశీఖండము

కాశధరిత్రీవలయము
లాశుగతిం గాల్పఁ గడఁగునట్టిమహోగ్రున్. 161

వ. కాంచి యక్కుంభినీధరంబు కుంభసంభవు నతిథిసత్కారసంభావనావిశేషంబులం బరితోషంబు సంపాదించి కరాంభోరుహంబులు మోడ్చి ‘మహానుభావా! నీయాజ్ఞాప్రసాదభవంబున ననుం గృతార్థుం జేయు’మని పలికిన. 162

సీ. వింధ్యాచలేంద్ర! పృథ్వీభృత్కులశ్రేష్ఠ!
దక్షిణాపథము తీర్థంబు లాడఁ
బోవుచున్నాఁడ నీ పువ్వుఁబోఁడియు నేను
బెద్దకాలమునాఁటి పెరిచ గాన
లావు చాలదు జక్లైబ్యంబుకతమునఁ
బొడ వెక్కునపుడు డిగ్గెడునపుడును
నభ్రంకషము లైనయానీశిరశ్శృంగ
శృంగాటకము లిట్లు చిఱుతపఱిచి
తే. యనఘ! నేఁ గ్రమ్మఱఁగ వచ్చునంతదాఁక
నుండవలయు ధరిత్రిలో నొదిఁగి నీవు
చేయు నాయాజ్ఞ లెస్స యౌఁ జేయకున్న
నెఱిఁగెదవు గాక రజ్జాడ నేల యిపుడు? 163

వ. అనిన వింధ్యంబు మహాత్మా! చరాచరంబైనజగంబునందు నీయాజ్ఞఁ జేయనివారునుం గలరె! నీవు మరలి విచ్చేయునంతదాఁకను నిట్ల యుండెద ననినఁ గుంభసంభవుం డతని దీవించి నిజపాదాంభోరుహవిన్యాసంబుల విశ్వవిశ్వంభరాభాగంబు భాగ్యవంతంబు గావించుచు దక్షిణదిశాభిముఖు