Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అర్థదోషములు

క.

ఇవి వాక్యజాతదోషము, లవిరళముగఁ దెలియుఁ డింక నర్థక్రమసం
భవము లగుదోషముఖలఁ దగఁ, జెవులకుఁ జవు లొదవ [1]నోలిఁ జెప్పెద నొప్పన్.

112


సీ.

వరుస నపార్థంబు వ్యర్థంబు హీనాధికోపమంబులు సంశయోక్తికంబు
నసిమాత్రకంబు నేకార్థంబు భిన్నంబు జరపదక్రమమును బరుషకంబు
నసదృశోపమమును నప్రసిద్ధోపమ మును హేతుశూన్యార్థమును దనర్చు
విరసాహ్వయంబును నిరలంకృతియు విరుద్ధంబు నసంగ[2]తత్వం బనంగఁ


తే.

గబ్బముల సప్తదశదోషఘటన లొదవుఁ
బ్రౌఢి వానికిఁ బాసి సత్ప్రభువు లైన
యుభయభాషాకవీంద్రుల కొసఁగుఁ బొసఁగఁ
జారుతరకీర్తి విశ్వేశచక్రవర్తి.

113

అపార్థము

క.

[3]ధనదునకు నెంద ఱంగన?, లనుములు నాకమునఁ బండునా? పాతాళం
బునఁ బాము లెన్నిగలవో?, యనఁగ నపార్థంబు వాచికార్థము గామిన్.

114

వ్యర్థము

తే.

'మీరు పెద్దలు, [4]కులమును బౌరుషంబు
విశ్రుతంబులు, గుణము [5]లీవితతు, లేల
యధిపుఁ గొలువారు దా?' రన వ్యర్థ మయ్యెఁ
తొలుతఁ బలుకులు భజనహేతువులు గామి.

115

హీనోపమ</pె

క.

[6]కుక్కలునుబోలె దనుజులు
[7]మిక్కుటముగఁ గదుర సురలు మృగములభంగిన్
దిక్కులు చెడి పాఱిరి నాఁ
దక్కక హీనోపమాభిధానంబయ్యెన్.

116

అధికోపమ

క.

అకుటిలగతిఁ గొలఁకులలో, బకములు మునివరులుఁబోలెఁ బరఁగె ననంగాఁ
బ్రకటిత యగు నధికోపమ, సుకవిత నీరెండుఁ జొనుప శూన్యం బయ్యెన్.

117

సంశయము

క.

నీ వన్నపలుకు చెప్పిన, నావెలఁదికి నలుగ నేల యన సంశయ మై
భావింపంబడు నీ వను, నావెరవున నన్న గామి నవ్యార్థం బై.

118
  1. క.గ.చ. ఓలిఁ జెప్పెదు నొప్పన్
  2. క.గ. తత్వంబు ననఁగఁ
  3. క.గ.చ. ధనదులకు
  4. క.గ.చ. కుల మురుపౌరుషంబు
  5. క.గ.చ. ఈవిమతు లేల
  6. క.గ.చ. కుక్కలును బోని దనుజుల
  7. క.గ.చ. మిక్కుటమునఁ గదరి