Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గజమాల పద్యాష్టకము, పద్యనవకంబు నవరత్నమాలిక, నలినమిత్ర
మాలిక పండ్రెండు మధురపద్యము, లిందుకళ షోడశశ్లోకకలిత యైన,


తే.

సప్తవింశతి యైన నక్షత్రమాల,
తెలియ ముప్పది పద్యముల్ [1]త్రింశదాఖ్య,
మవలఁ బంచాశదాహ్వయం బైదుపదులు,
శతక మన నొప్పు మఱి పద్యశతము గూడ.

9


క.

అష్టోత్తరశతపద్యము, లష్టోత్తరశతక మనఁగ నడరుఁ గవీంద్రుం
డిష్ట మగు సంఖ్యఁ జెప్పిన, దుష్టము గా దదియుఁ గర్ణతుష్టిన చేయున్.

10

ఉదాహరణలక్షణము

క.

ధరఁ జాటుకృతులలోనం, బరఁగు [2]నుదాహరణ మనుప్రబంధము, తద్వి
స్తరలక్షణంబు బరువడిఁ, బరికింపఁగఁ దగు నశేషభాషాకవులున్.

11


క.

చతురశ్ర[3]త్ర్యశ్రాదివి, తతయతితాళములు గలుగుదళముల నెల్లన్
గృతగుచ్ఛానుప్రాసం, బతులికగతి నిలుపఁ దగు నుదాహరణలకున్.

12


క.

సురభాసాదిప్రాకృతపరిభాషల నైన నితరభాషల నైనన్
విరచించుట యుక్త ముదా, హరణ మిలాసురముఖాదు లగుపుణ్యులకున్.

13

విభక్తులకు మాఱుపేరులు

సీ.

ప్రథమావిభక్తి చొప్పడు వాణి నాఁగ, రెండవయది [4]ఝట నాగ నతిశయిల్లుఁ,
గీర్తి మూఁడవవిభక్తికిఁ బేరు, నాలవయది దేవలాభిని యండ్రు గృతులఁ,
[5]బంచమి పాణి నాఁ బరఁగు, షష్ఠవిభక్తి పాటిల్లు సుకవులు మోటి నాఁగ,
సప్తమి ఘోటికాసంజ్ఞిత, సంబుద్ధి సరసావళీనామ; జగతి వీని

విభక్తుల దేవతలు

తే.

కయిన వేల్పులు వీరావళియును [6]గీర్తి
మతి సుభగయును మఱి భోగమాలినియును
మహిఁ గళావతియును గాంతిమతియుఁ గమల
యును జయవతియు [7]నాఁగను నొప్పు నెపుడు.

14


క.

ఈవిదితాష్టవిభక్త్యధి, దేవత లాత్మీయ[8]నామధేయసమము గా
భావింపఁ దగినశుభములఁ, గావింతురు కర్తృనాయకద్వయమునకున్.

15


క.

మును శుభగణవర్ణతఁ బ, ర్విన మాలిని యొండెఁ జండవృత్తమ యెండెం
దనరింపవలయుఁ బ్రథమకు, ఘనకలికాష్టకతదర్థకలికాయుక్తిన్.

16


క.

ఇం బడరఁగఁ బ్రథమాదుల, సంబుద్ధ్యంతముల నైన సరళవిభక్త్యా
లంబనపద్యంబుల బిరు, దంబులు గలపౌరుషములు దగ నిడవలయున్.

17


తే.

కళిక యేతాళమునఁ బరిఘటిత యయ్యె
నుత్కళికయును దానన యునుపవలయు,

  1. క.గ.చ. త్రింశదాఖ్య, మౌలఁ
  2. క.గ.చ. నుదాహరణ యను
  3. క.గ.చ. త్ర్యశ్రాదివి, తతియతి
  4. క. ఝటి నాగ, గ.చ. యెటి నాగ
  5. క.గ.చ. బంచమి వాది నాఁ బరఁగు
  6. క.గ.చ. గీర్తిమతియు సుభగయు
  7. క.గ.చ. ననంగ నొప్పు నెపుడు
  8. క.గ.చ. నామధేయసమము లై