పుట:కామకళానిధి.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

పురుషశిరమునందు బొట్టనవ్రేలితో
నడిమివ్రేలు గూర్చి యదిమెనేని
విటుఁడు సురతమునకు వేగ నారంభించుఁ
గాన కుండలాఖ్య ఘనత గాంచు.


వ.

మఱియు జపేటంబును జబుకఘాతంబును బంచాం
గుళంబును మొదలైనవి కొందఱచేత నెన్నబడియె. నవి నీచ
నాయికానాయకంబు లగుట హేయంబులు. హుంకృతంబు
స్తనితంబు ఫూత్కారంబు హూత్కృతంబు నన సీత్కారంబు
లేనువిధములు. ముఖనాసికాసహితంబుగా నుచ్ఛ్వాసం బొన
ర్చుట హుంకృతంబు, మేఘరవాకారంబున మ్రోయ స్తనితంబు
భుజంగోచ్ఛ్వాసరీతి నొనర్చుట ఫూత్కృతంబు, జలంబుల వర్ష
ధారలట్లు మ్రోయుట హూత్కృతంబు, దంతక్షతాది సమయం
బుల రసనాగ్రంబున నూర్ప నది సీత్కృతంబు నగు. ఇంక మణిత
భేదంబు లెఱింగించెద. కోకిలరవంబును శుకరవంబును లావు
కరవంబును హంసరవంబును జక్రవాకరవంబును బారావతరవం
బును బికరవంబును నన నెన్మిది తెరఁగులు. కంఠంబున నవ్యక్త
మధురంబుగ సురతంబు కొనగోరు లొల్చి చందంబున లయ
బంధంబుగా నుచ్చరించిన మణితంబు లన నొప్పు. నివియన్నియు
బాహ్యోపచారంబులు. ఇంక చతురసీతిబంధంబులకు లక్షణంబు
లెఱింగించెద. నెట్టులనిన.