పుట:కామకళానిధి.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కర మగుట భుజంగవల్లికం బనబరగున్.


గీ.

రెండుచేతుల నెఱికురుల్ రెమ్మిపట్టి
కలియుగాంతుఁడు సమహస్తకం బనంగ
నటుల బలుమారు విడుచుచు నలమిపట్టి
ధారుణి దురంగరంగమై తనరుచుండు.


గీ.

వర్ణదేశంబున గల కచభారంబు నూని
ముద్దిడ దంపతు లొక్కరొక్కరు
నధికమోహంబునను సురతాంతమందు
ధర జనులు దీని గామావతంస మండ్రు.


వ.

సంతాడితంబును, బతాకంబును, బిందుమూలంబును,
గుండలంబు నన తాడనభేదంబులు తల్లక్షణంబు సెప్పెదను.


గీ.

ఉపరిరతమందు ప్రియునురము ముష్టి
తాడనము సేయ నదియ సంతాడనంబు
విభుఁడు రమియింప నరచేత బ్రియునితోడ
నం బది పతాకసంజ్ఞయై నయము గాంచు.


గీ.

పిడికిలించి బొటనవ్రేలు సోకగ విభు
వీపునందు దెబ్బ వైచెనేని
యదియు బిందుమూల యని కామతంత్రజ్ఞు
లనిరి సురతవేళలందు దలప.