పుట:కామకళానిధి.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

మార్చిమార్చి పతియు మగువయు చుబుకంబు
పట్టి మోవి ముద్దు పెట్టుకొనిన
మోహ మగ్గలముగ బుట్టు గావునను
సువదన మనుచు దెలియ బలుకబడియె.


గీ.

అలసి నిదురబోవు నంగన మేల్కొన
తలచితలచి విభుఁడు తత్పరతను
గళము నాభి మోవి గన్నులు ముద్దిడ
నది ప్రబోధకాఖ్య మనఁగ బరగు.


గీ.

మగువ విభుఁడు గూడి మమత నన్యోన్యంబు
పెదవులందు పెదవు లదిమియుంచి
నాల్క నాల్క గూర్చి నయముగా జుంబించి
నది సమోష్ఠసంఖ్య నమరియుండు.


గీ.

కాంత తనకన్నముందుగా గరచదలచి
బాహుమూలమ్ములను పంచబాణునింట
మోహ మతిశమైయుండ ముద్దుగొనిన
నర్ధచుంబన మని పల్క నగును గృతుల.


వ.

మరియు నింక ప్రాంత ప్రతివిషయక సంక్రాంత ప్ర
భృతి చుంబనంబులు గలవందురు. అవియు నిం దంతర్భూతంబు
లగుటచే రచియింపంబడవు. ఇంక నఖక్షతంబులు కంఠంబున,
గరంబుల, జఘనంబుల, స్తనంబుల, వీపున, దోర్మూలంబున,