పుట:కామకళానిధి.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హృదయంబున, పార్శ్వంబుల, గుహ్యంబుల, నితంబమ్ముల,
నాభిని, గడ్డంబుల నొనర్పవలయు నివియును ఛురితమండల,
అర్ధచంద్ర, మయూరపాద, శశప్లుత, ఉత్పలపత్ర భేదంబుల
నారుతెరగులుగా నొప్పియుండు.


క.

చెక్కుల గంఠతలంబున
బ్రక్కన మోవిని నురోజపాళిన్ గోరుల్
నొక్కగ నులువుగ నిల్చిన
నెక్కొను పులకలును మేన నిది ఛురిత మగున్.


క.

పిరుదుల నూరువులం కం
ధరను గుచంబులును గుహ్యతలమున గోరుల్
సరిగా నొక్కటి నిల్పిన
నరయగ నిది యర్ధచంద్ర మనఁగాఁ బఱగున్.


గీ.

ముఖమునందు కంఠమున నుదరంబున
కుచయుగంబునందు గోరు లెదురు
గలుగ వరుసగానుఁ గదియింప మండల
కం బనంగనగు నఖక్షతంబు.


గీ.

ఒక్కబొటనవ్రేలు తక్క దక్కినవేళ్ళ
గోళ్ళచూచుకమున గూర్చి నిలుప
నది మయూరపాద మని కామశాస్త్రజ్ఞు
లనిరి మోదరేతు వనుచు సతము.