పుట:కామకళానిధి.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లాలనము సేయఁదగుఁ బ్రీతి లక్షణజ్ఞు
లరసి యభ్యాసికియటండ్రు సరసమతిని.


వ.

ఇక విరక్తి లక్షణమును జెప్పెదను.


క.

కనుఁగొనదు పతికి నుత్తర
మును నీయదు దూరమైన మోదము నందున్
మనసిజకేళికి నొచ్చును
దనరక శయ్యపయి నుఱక తా నిదురించున్.


వ.

ఈవిరక్తికి హేతువు లెఱింగించెద.


సీ.

అతిలోభమున భోగ మనుభవింపక యున్న
                     నేరము ల్సేసిన శూరుఁడైన
మఱియొక్క మగువపై మమత మిక్కిలియైనఁ
                     గస్సున నేవేళఁ గదుముచున్న
తనకు సమ్మతము గాఁదనియుఁ గూడకయున్న
                     ముట్టుమానిన జాల ముసలియైన
గలియుచో మిక్కిలికఠినంబు సేసిన
                     నిందలు మోపిన బందుఁడైన
నాదరింపకయుండిన నత్త మామ
గారితోఁ గూడి మనసీక కఠినుఁడైనఁ
బూయఁగూడను దొడుగను ముడువఁ గుడువ
దొరకదేని విరక్తి దాఁ దోఁచునండ్రు.