పుట:కామకళానిధి.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తొల్త నవసంగమముఁ జేయుతోయజాక్షి
యొక్కవాసర ముపవాస మున్నతరుణి
యరయ నభ్యంజనము జేసినట్టి కాంత
కరఁగు నతివేగఁసురతంబు నందుఁదలఁప.


గీ.

ఇఁక బ్రమోదవిధంబుల నేర్పరింతు
నెట్టులన నాల్గువిధములై నెసఁగు నవియు
దంపతుల కితరేతరత్వప్రయుక్త
మైన యనురాగమే ప్రీతి యనఁగఁ దనరు.


వ.

అదియు నైసర్గికప్రీతియు వైషయికప్రీతియు నను
నామంబులం జెలంగును. తల్లక్షణంబు లెట్టివనిన.


గీ.

దంపతుల కొకరొకరికిఁ దానె పొడమి
పిన్ననాఁటనె యుండియు వృద్ధిఁ జెంది
యభ్యసింప రాకనె యధికమైన
ప్రీతి నైసర్గిక మటంచు ఖ్యాతియయ్యె.


గీ.

పువులు సొమ్ములు గంధంబు భోజనంబు
మొదలుగా గలవస్తువు లొసఁగఁ గల్గు
ప్రీతి దా వైషయికియని పేరువడియె
సమ యనెడి ప్రీతి యివి రెండు సమములైన.


గీ.

ఆటపాటల మెచ్చుట వేఁటలందు
దేవతోత్సవములయందు భావ మెఱిఁగి