కవిత నూతనకథాకల్పనకుఁ ద్రోవదీసిన నెంతరమణీయముగ నుండునో గదా!
అబ్బయామాత్యుఁడు పలుతావుల వసుచరిత్రము ననుకరించినాఁడు. కొన్నితావుల వ్యాకరణనియమములఁ గూలత్రోసినాఁడు. ఈతని స్వతంత్రరచనము మృదుమధురపదభూయిష్ఠ మై తెలుఁగు నుడికారములందలి తీరుతీయముల వెదజల్లుచుండును. శృంగారనైషధములోని కొన్నిపద్యముల కనుకరణము లితనికవితలోఁ గలవు.
సీ. | “నిఖలవిద్యానటీనృత్తరంగస్థలా | శృంగా-ఆ.1. ప.46. |
సీ. | “నవకీ ర్తినర్తకీనాట్యగంగావధీ | కవిరా-ఆ-1. ప-87. |
చ. | "ఇతఁడు దరిద్రుఁ డౌ ననుచు నేర్పడ నర్థిఁ లలాటపట్టికన్ | శృంగా-ఆ-1. ప.57. |
మ. | “అయమర్థీజనయంచు యాచకలలాటాంతస్స్థతిన్ బ్రహ్మని | కవిరా.ఆ.1. ప-98 |
వసుచరిత్రము ననుకరించిన పద్యములనుగూడఁ జూపుట ప్రకృతము కాకపోదని ఒకపద్యమును జూపుచున్నారము.