పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చక్రహితకన్యకాతటి, చక్రోత్పలపత్రఘటనచతురనతసుధీ
చక్రధరాచక్రధరా, చక్రధరాకీర్తిమగ్నచక్రధరార్ద్రా.

301


పృథ్వీవృత్తము.

గదాకరముదాకరద్యుతివికస్వరా సుస్వరా
సదాశివపదాశివస్తనితశ్లాఘ్య కాభిఖ్యకా
గదాగ్రజపదాగ్రజత్రిపథగావనా పావనా
విదాహితమదాహితప్రకటవిక్రమాశుక్రమా.

302


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తి
రామనమంత్రితనూభవ సుజనహితకృత్య నిత్యాబ్బయామాత్యప్రణీతం బయిన
కవిరాజమనోరంజనం బనుమహాప్రబంధంబునందు సర్వంబును బంచమాశ్వాసము.


కవిరాజమనోరంజనము సంపూర్ణము.

చెన్నపురి : శ్రీ 'రామ' ప్రెస్సున ముద్రితము — 1929.