పుట:కవిరాక్షసీయము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తేన = భృత్యులుగల, బాహునా= భుజబలముచేత, అనఁగా అసహాయశూరత్వముచేత, జగత్ = లోకము, రక్ష్యతే = పాలింపఁబడుచున్నదో, సః = అట్టి, పురుషఏవ =పురుషుఁడే, మహాన్ = శ్రేష్ఠుఁడు.


అర్థాంతరము.

సత్యానురోధినః - సత్యా= సత్యభామను, అనురోధినః = అనుసరించుచున్న, యస్య = ఏ శ్రీకృష్ణునియొక్క, ఆక్షిప్తపారిజాతేన - ఆక్షిప్త = పెరికివేయఁబడినట్టి, పారిజాతేన = పారిజాతవృక్షము కలిగినట్టి, బాహునా = భుజముచేత, జగత్ = లోకము, రక్ష్యతే = పాలింపఁబడుచున్నదో, సః = అట్టి, పురుషః ఏవ = పురుషోత్తముఁ డైన శ్రీకృష్ణమూర్తియే, మహాన్ = గొప్పదేవుఁడు.


తా.

సత్యము విడువక భూభారమును తనభృత్యులగు రాజపురుషులం దుంచక తనబాహుబలముచేతనే భూపరిపాలనముచేయు పురుషుఁడే హెచ్చైనవాఁ డనియు, రుక్ష్మీణీదేవికి పారిజాతపుష్ప మిచ్చుటచే అసూయాపరవశ యగుసత్యభామచే ప్రార్థింపఁబడినవాఁడై ఇంద్రలోకముననున్న పారిజాతవృక్షమునే తెచ్చి సత్యభామగృహమందు నాటి కంసాదిదుష్టుల నడంచి లోకములను పాలించెడి శ్రీకృష్ణమూర్తి యొక్కఁడే దేవాదిదేవుఁడు.


కావ్యముయొక్క ఆదిమధ్యాంతములందు మంగళం బాచరించుట శిష్టాచారంబు గాన, నీగ్రంథమందు ప్రారంభమున “గుణదోషౌ బుధోగృహ్ణన్ ” అనుశ్లోకమున పరమేశ్వర గుణవర్ణనరూపమైన మంగళమును, మధ్యమందు ‘స్వస్థానాదవరోప్య' అను మొదలగువానిచేతను, తుదియం దీశ్లోకముచేతను మంగళము నాచరించి యున్నాఁడు. సంస్కృతవ్యాఖ్యయందు "అత్రాదౌ త్రయీత్యాదినా భగవద్వర్ణనరూపో మఙ్గళాచారః కృతః" అని యుండుటచే నీ గ్రంథమునకు ముఖమందు వేఱొకశ్లోక ముండవలయునని తోఁచుచున్నది.


శ్లో.

సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసా ఏవ కేవలం,
కవిరాక్షస ఏవాయం కవిరాక్షసకృత్యతః.

ఇది శ్రీ శ్రీనివాసపుర సుబ్బరాయార్యపుత్త్ర లోకనాథకవి
విరచితంబైన కవిరాక్షసీయాంధ్రవ్యాఖ్యానము
సంపూర్ణము.