పుట:కవికర్ణరసాయనము.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆదిమశఠకోపాది, ద్వాదశనిజసూరివిరచితద్రావిళగ్రం
థాదృతసతతశ్రవణా, స్వాదకళాముక్తముక్తసామవిభేదా.

219


మాలిని.

శతశతరవితేజా సర్వరాజాధిరాజా
నతజనసురభూజా నాభిదీవ్యత్పయోజా
సతతమహితభూమా సత్యసంపూర్ణకామా
దితిసుతకులభీమా దేవతాసార్వభౌమా.

220


గద్య.

ఇది శ్రీమద్భట్టపరాశరదేశికేంద్రచరణసరసీరుహసేపకోపసేవక నరసింహనామధేయ
ప్రణీతం బైనకవికర్ణరసాయనం బనుకావ్యంబునందుఁ దపశ్చరణంబును, గ్రీష్మవర్షా
శిశిరర్తువర్ణనంబులును, అప్సరస్సమాగమప్రకారంబును, నృత్తప్రపంచంబును,
సముద్రవర్ణనంబును, వైకుంఠవర్ణనంబును, భగవద్దివ్యమండపవిగ్రహవర్ణనంబును,
స్తోత్రంబును నన్నది సర్వంబును షష్ఠాశ్వాసము.

కవికర్ణరసాయనము సంపూర్ణము.

చెన్నపురి : వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
ఆదిసరస్వతీనిలయముద్రాక్షరశాలయందు
ముద్రితము —1916.