చ. | కొలఁదిగ నీడ్చి యీడ్చి కొనగోళ్ళ మెఱుంగు దుఱంగలింపఁ గా | 86 |
ఉ. | పట్టినహస్తకాంతి మును పల్లవితం బగువీణె పాటచేఁ | 87 |
క. | ఈరీతి వివిధమధురా, కారంబులఁ దమవిలాసగరిమలు నెఱపన్ | 88 |
సీ | కుసుమపల్లవభాసికుంజపుంజంబులు, రత్నచిత్రితమందిరంబు లయ్యె | |
తే. | దీవ్రనియమానుకూలప్రదేశ మైన, యర్కకులమౌళి నివసించునాశ్రమంబు | 89 |
వ. | అనంతరంబ సమయసముచితసన్మార్గధూపలేపస్రగ్బలిప్రకరవర్ణనోపశోభితం బై తపస్వి | |