పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35

ప్రధమాశ్వాసము



    

    గేసరములును నవనాగకేసరములుఁ
    గాంతలార కంటిరె కడువింత లనుచు. 141

    పూఁబోఁడి యొరసికొని చన
    గాఁ బయ్యెద యొడిసి పట్టె గనుఁగొంటె చెలీ
    లేఁబొన్నను భళిరా యిది
    గోఁ బురుషాహ్వయము నిలుపుకొనుసమయంబున్. 142

    ఆలికుచంబులు నాగ
    య్యాలికుచంబులును వాదులాడెడురొద గా
    బోలు ననఁ దనరె నూపుర
    కోలాహలచకితకీరఘోషము వింటే. 143

 క. లేఁగరువలిచే ముందటి
    పూఁగొమ్మలు పాయవడుచు భుజగతి నెఱపం
    గాఁ గురవక మిదె తివిరెడుఁ
    గౌఁగిటికి న్నీకుఁ దగునె కైకొనవె చెలీ. 144

చ. పయఁట చెఱంగు శాఖ యనుపాణిఁ దెరల్చుచు నోలతాంగితా,
    బ్రియమున భృంగ కేతవనిరీక్షణము ల్కుచకుట్మలంబు లం,
    గయికొన నొప్పుపల్లవశిఖామణి మామిడి రి త్తవోవునే
    భయ మిఁక నేల యే మిచటఁ బత్త్రముఁ బుష్పము వేడ్క నందితో 145