పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము. 431

జనపతి కోరె నవిఘ్నత
ననయముఁ గొనసాగి రాఁ దదాగమనంబున్.

ఉ. ఆ యెల నాఁగ యంతటఁ దదాలయ సన్నిధిఁ బేర్చు లజ్జ పెన్
రాయిడి చేత బోంట్లను గరం బలయించెను సాగిపోక భూ
నాయకుఁ డేమియ ప్రియ మొనర్చితి నీకును దోసకారిసి
గ్లా యుడికిం చెది త ననుఁ గాంతనురా పిడకుచుదూజగన్

క. అంతటఁ దగ్గృహదేహళి
చెంతకు నయ్యింతి చేర శీఘ్రతఁ జని భూ
కాంతుఁడు దనపానుపుపై
సంతసమునఁ బోదలుచుండె శయనించి తగన్.

వ. అంత.


ఆ. ఓసి వెళ్లి పడుచ యూరక రమ్ము పె
నంగ కెదుట నదె కనుంగొనియెడు
ననుచు నొయ్యఁ బలుకుచును జూ పెఁ బ్రియు నొక్క
ముగుద కేల నోరు మూసికొనుచు.

క. అడుగులు తడఁబడఁ బులకలు
పొడమఁగ సఖి వెనుక కొదుఁగఁ బోవుచు నర సెన్
మెడ మలఁచి పడఁతి యప్పుడు
కడకంటివిలోకనమునఁ గాంతునియునికిన్