పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25

ప్రధమాశ్వాసము

   
    శేషునకు నైన వర్ణన సేయ వశమె
    యనఘు నంద్యాలకృష్ణధరాధిపతిని. 96

-:షష్ఠ్యంతములు:-





క. ఈదృశగుణరమ్యున క
    న్యాదృశధరణివరదురభినయసామ్యునకున్
    వైదిక పథరక్షునకు న
    లాదిక నృపనయతిరస్క్రియాదక్షునకున్. 97

క. ఆధునిక రామభద్రున
   కాధిక్యచణాహవక్రియారుద్రునకున్
   మాధవపదపద్మసమా
   రాధనవిధిసాధితావిరతభద్రునకున్. 98

క. జయలక్ష్మీపరిణయసహృ
   దయకీర్తిసతీసమర్పితస్పుటతేజో
   మయహారిద్రాక్షతసం
   చయమధురితదిక్పురంధ్రిజననిటలునకున్. 99

క. దానోదకధారామహి
   మానారతశీతలీకృతాంగణభూభా
   గానుష్ఠితయాచక సం
   తానాకించన్యజన్యతాపక్షతికిన్. 100

క. ఇభకర్ణ తాళవృంత
   ప్రభవానిలసుఖితపరనృపప్రహితసువ