పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

కళాపూర్ణోదయము

    స్తుభరవహజనసమాకీ
    ర్ణభవనగోపురబహిర్ధరాభాగునకున్. 101

క. శ్రీనంద్యాలనృసింహ
    క్ష్మానాధతనూజునకు సమంచితవిభవ
    శ్రీనవ్యబిడౌజునకును
    దానకళాతులిత దైవతక్ష్మాజునకున్. 102

క. ఆత్రేయమౌనిగోత్రప
    విత్రునకు విరోధిమదలవిత్రునకు దిశా
    జైత్రునకు లోచనోత్సవ
    గాత్రునకును గొండమాంబికాపుత్త్రునకున్. 103

క. విశ్రుతతిరుమలతాతా
    ర్యశ్రేష్ఠాన్వయసుదర్శనాచార్యతనూ
    జశ్రీనివాసగురుచర
    ణాశ్రయణ సమార్జితాఖిలాభ్యుదయునకున్. 104

క. జిష్ణుయశోధిక్షేపణ
    ధృష్ణుమహాశౌర్యపద్దతీఖేలునకున్
    వైష్ణవమతశీలునకుం
    గృష్ణమహీపాలునకును గృతిలోలునకున్ 105

వ. అభ్యుదయపరంపరాభివృద్ధియు నాయురారోగ్యసమృద్ధియు నగునట్లుగా
    నాయొనర్పంబూనినకళాపూర్ణోదయం బను మహాప్రబంధంబునకుం గథాక్రమం బెట్టి దనిన. 106