పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

354

కళాపూర్ణోదయము


 
బెద్దఱికము చాలదు పేజ
సుద్దులు గల్పింతు రెందు సుజనులు గలరే.153

క. కావున నిచటన మరీ
దైవతవనిత లను గుట్టు దప్పక యుండం
ద్రోవుఁడు దివసము లే మొక
భూవరఁ గని వెభవంబుఁ బొందెడు దాఁకన్.154

గీ. అపుడు గాని మాతండ్రి యున్నట్టిచోటు
నరసి సంధించుకొనుటకు వెరవు పడదు
తప్ప దిది యని పొరలు తమనివాస
మొరు లెఱుఁగకుండ వెలువడియరిగి రంత.155

వ. అట్లరిగి యాబ్రహ్మచారులు నలువురు పురంబులో సం గొం
తసంచారంబు చేసి యప్పుడదియే లేడు రాజు మదాశయుం
డు గావున నతని వాకిటికిం జని యతండు సకలవిద్యావిశేష
జ్ఞుం డనియుఁ దద్దర్శనంబు పురోహితునియనుమతి లేక బౌ
హ్మణుల కెవ్వరికి దొరక దనియు నతండు విద్యాధికుండు
కాకుండుటు జేసి నిజ గౌరవ శైథిల్యభయంబున నితరు లగు
విద్యాధికులకు రాజగృహంబునఁ బ్రవేశంబు లేకయుండ
దౌవారికాదిసక లషరిజనచక్రంబును వలకట్టుకొని యుండు
టయుఁ బభువునకు యాగేచ్చగలిగి తనతోడ విచారించినఁ
దదా ర్త్విజ్య సమర్థుల నెచ్చటం గాన మని పరిబోధించుట
యు నచ్చటిజనంబులవలన విని మఱియును.156