పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

కళాపూర్ణోదయము



క. అప్రతిమముగి' విజాతీ
యప్రత్యయవాసనానిరాసావిచ్చి
న్నప్రవహదురు సజాతీ
యప్రత్యయరూప మగుచు ధ్యానము వెలయున్ .178

క. అగి సగుణ ధ్యానమసెన్
సడమలగుణ వినుము నిర్గుణ ధ్యాన మనన్
విదితముగ నిరు దెఱంగుల
మొదలిటియది చేయ నితరమును సిద్ధించున్. 179

చ. సగుణ మనంగ నిక విను శుఖసుదర్శన ముఖ్య చిహ్నితం
బగు పురుషో త్తమాకృతి తదన్యము నిర్మలనిత్య చిస్మియం
బగుపరమాత్మకూప మది యబ్బుట దుర్లభ మెట్టి వారికిస్
సగుణవిలాసచ్చితనము సల్బఁగ సల్పఁగఁగాని భూసురా.180

క. మానసము విష్ణునందున్
లీన మగుచు నిచుకయుఁ జలింపక యుండం
బూనుట సమాధి యగు వి
ద్యా నిరతా యేక కూప మది భావింషన్•181

వ. ఇది యోగవిద్యాప్రకారంబు దీని మహత్వంబునం జేసి య
జంగున భావంబు దనయందుఁ దిరంబుగా నిలుపుచు నా
సిద్ధుండు స్వభావుం డనం బరఁగే.182