పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము.

301



సాంప్రదాయికముగఁ జలుపుచు నుండుదు
రోవ సుంధ రాసురావతం స174

సీ. పాదాదిగా జానుపర్యంత ముర్వి యు
ర్వ్యాదిగాఁ బాయు పర్యంత ముదక
ముద కాదిగా మఱి హృదయాబ్జపర్యంత
మగ్ని యగ్న్యా దిగా నందు మీఁద
భ్రూమధ్యపర్యంతము మరుత్తు మరుదాది
గా మూర్ధ పర్యంత మోమహాత్మ
నభము వర్తిల్లుఁ దానక మవి యైను భా
వింపఁగా వేర్వేజ విహితగతిని

గీ. ధాతృనిష్ణురు ద్రేశ సదాశి వాఖ్య
దైవతములఁ బృథి వ్యాధి తత్త్వపంచ
కమున ధారణ మొనరింపఁగావలయును
బ్రణవమునను బ్రాణాయామభంగు లమర.175

ఆ. అని మఱియును దద్రహస్యవి శేషంబు
లన్నియును వచించి ప్రాణముఖ్య
పవనగతుల తెఱఁగు పదునెనిమిది మర్మ
ములును నాడు లుండుపొలుపుఁ దెలిపె.176

వ. తెలిపి యింక ధ్యాన ప్రకారంబు విను మని యిట్లనియె.