పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

93

ద్వితీయాశ్వాసము

   నుదరబంధమున నిం పొంది భేదిల్లదు
                      శ్రీవత్సమున కెట్లు చేరఁ దిగుతు
   శ్రీవత్సమునఁ దారసిలిన రానేరదు
                      కేలుఁదామరల కేక్రియ మరల్తుఁ

గీ. గేలుఁదామరలను గళశ్రీల మోవి
   మకరకుండలముల గండమండలముల
   నాసఁ గనుఁగవ బొమలఁగుంతలములందు
   నెందుఁ బర్విన విడఁజాల దేమి చెప్ప.136


వ. అని పరమానందంబున నితరప్రపంచంబు సర్వంబునుమఱచి కొంతతడవు నిరీక్షించి
   తదనంతరంబ దండ ప్రణామంబు లనేకంబులుగావించి విపంచీసమంచితమృదుమధురనినదంబును
   గంఠస్వరంబును నేకం బగుచు లోకుల నస్తోక సమ్మదాశ్చర్యసంభృతస్తంభభావులఁ గావింప నద్దేవుని
   దివ్యమంగళగుణగానంబు లొనరించె నివ్విధంబున మూఁ డహోరాత్రంబులు సేవించి వేంకటనగంబు
   డిగ్గి చని చని ముందట.137

సీ. ఏపట్టణము ముక్తిహేతుసప్తపురాంత
              రభిగణనాతివిఖ్యాతిశాలి
    యేపట్టణము ఖేలదే కామ్రవిభుశిర
              స్సింధుమత్సరిసరశ్శ్రీవిభాసి