పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

కళాపూర్ణోదయము

     వరదహస్తముఁ గటి వర్తిల్లు కేలు శం
                  ఖముఁ జక్రమును దాల్చుకర యుగంబుఁ
     దారహారంబులుఁ జారుకంఠంబు ని
                  ద్దపుఁజెక్కులును నవ్వుఁదళుకుపసలు

గీ. మకరకుండలములును డామరలఁ దెగడు
     కన్నులు మనోజ్ఞనాసయుఁ గలికిబొమలు
     ముత్తియపునామమును రత్నముకుటవరము
     నెసఁగఁ గనుపట్టుశ్రీవేంకటేశుఁ జూచె. 132
 
వ. ఇట్లు చూచి.133

శా. ప్రత్యంగంబును మిక్కిలిం దడవుగా భావించి భావించి యా
    దైత్యారాతితనూవిలాసము సమస్తంబున్ విలోకించెఁ దా
    నత్యంతంబును వేడ్కఁ బొంగుచు నితాంతాశ్చర్యముం బొందుచుం,
    గృత్యం బేమియుఁ గొంతప్రొ ద్దెఱుఁగక క్షీణ ప్రమోదంబుతోన్.134

వ. పదంపడి నిజానుభవం బిట్లని యుగ్గడింపం దొడంగి 135

సీ. పదపద్మములఁ జిక్కి పాయదు నాదృష్టి
                      కనకాంబరమున కేకరణిఁ దెత్తుఁ
    గనకాంబరమునఁ గీల్కొనినఁ జలింప దే
                      నుదరబంధమున నెట్లొనరఁ గూర్తు