ఈ పుట ఆమోదించబడ్డది
నీతిదీపిక
మాఱుపనికిఁదాను మరలంగఁదగుఁగాని
పెక్కుపనులకొకట నిక్కరాదు.
ఆ. పెద్దవారలైనఁ బిన్నవారైనను
జెప్పునట్టిపలుకుఁజెవిని జొనిపి,
యుక్తియుక్తమైన, నొయ్యనగ్రహియింపు ;
కానిదైనఁగొనకమానుమీపు
తే. పలికిబొంకనిజిహ్వయుఁబాడిగలుగు
వర్తనముఁబాపమెఱుఁగనిబాహువులును
బురుషునకు నెందుజారనిభూషణములు
కాని, విలువబట్టలుగావు, కావునగలు.
ఆ. తెల్లవార లేచి, దినమెల్లంఆణాఛెయూ
కర్మచయములోనఁగర్మపాక్షి
ప్రతిదినంబు మంచిపనులఁగొన్నిటిఁ
జూచిఁయేగునట్టుగఁజరియింపవలయు.
ఆ. పరులునీకు నెట్లు వాంఛింతువోచేయి
బరుల కట్లచేయవలయు నీవు;
సర్వశాస్త్రములను జర్చింపఁదేలెడు
సారమైనధర్మసరణి యిదియె.
తే. మేనుక్షణభంగురంబౌట, మానసమున
నుంచి, రేపుచేసెదనని యుంటమాన
వలయుఁసద్దర్మములనేఁడెసలుపవలయు
నెల్లి మనముందుమోలేమొయెఱుఁగరాదు.
తే.గీ. ఇందుఁగలపాఠశాలలయందుఁజదువు
దిగువతరగతిబాలుర తెలిపి కొఱకు
నీతిదీపికయను నూఱు గీతములను
కందుకూరి వీరేశలింగము రచించె.