పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/852

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక

తే. తప్పుచేసితి వేనియు, నొప్పుకొనుము  ;

     గురునిముంగలఁగల్పించుకొనుచువచ్చి
     మాయమాటలఁజెప్పుట మానుకొమ్ము;
     దాననొజ్జలునీయెడదయఁదలంచు.

ఆ. పిలిచియొకరు మనయభిప్రాయ మడిగినఁ

      బక్షపాతబుద్ధిఁబాఱదోలి
      మనసునందుఁగలచె, మాటుపెట్టక తెల్పె
      వలయు, నొకనికెగ్గు గలుగుచున్న.

ఆ. సూక్ష్మమంచునించి చులుకసేయఁగ రాదు;

      సూక్ష్మములె,వినుండు, స్థూలమగును
      జలకణములు గలిపి, జలరాసికాలేదె?
       చిన్నవానినేల చేయువిడువ?

ఆ. మహిమనివాఱునెలలు సహవాసమొనరింప

       వారువీరలగుదు రారయంగఁ;
        గాన, జనుఁడుమంచిమానిసితోడనె
       చెలిమినెల్లతఱినిజేయవలయు.

తే. మున్నె, వాగ్దానమొనరింపకున్నయపుడె

        పదిగఁదలపోసిమఱిచేయవలయుఁజుమ్ము
         చేసి చెల్లింప లేకుంటసిగ్గుపాటు
         చేయుఁ గలిగియుఁజేయమి హేయమరయ

తే. తిన్నగా మాటలాడంగఁదెలియనట్టి

         వాఁడెవండైన, నినుదప్పఁబలికెనేనిఁ
         దప్పుగాఁబట్టుకొనుచును, దాని నీవు
         పట్టిపల్లార్చి, కోపంబుపడకుమెపుడు.

ఆ. ఒక్కకాలమందు నొక్కపనినెచేసి

         యయ్యది కడముట్టనై నవెనుక