పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/847

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక

గట్టుదురువానిమీద; దాకట్టుపడున;
నపుడురి క్తునిబ్రతు కేమియగునొచెపుడు.

తే.తాతముత్తాత లెంతెంత ధనముకూడ
బెట్టి, పెట్టెలునిండంగ బెట్టియున్న
గష్టపడి తామున్యాయమార్గమునబడయు
స్వార్జితంబొకగవ్వతోసమముగాదు.

తే.కాన, మానవు డెప్పుడు గష్టపడుచు,
వలయువిద్యల గళలను, బాల్యముననె
చక్కగా నేర్చియితరులసాయమాన
పడక, తనయెంతజీవింపగడగవలయు.

తే.న్యాయమార్గంబుతప్పకయర్ధమెపుడు
మనుజుడార్జించుచుండగజనును; దాన
బాత్రులకుదాన మొసరింపవలయుగొంత,
యనుభవింపంగవలయు దాననవరతము.

తే.తానుజేసినధర్మంబెతన్నుగాచు
ననుటలెస్సగాహృదయంబునందెఱింగి,
త్యాగమొనరింపవలయు; సానేగుతఱిని
తనదిచిల్లి గవ్వయు వెంటజనదుగాన.

ఆ.దానమియ్య లేక, తానునుదిన లేక,
ధనముభూమిలోన దాచిపెట్టి,
చెడుగులుబ్దు, దాని గడకుదొంగలపాలొ
నేలపాలొ, చేయునిహముగాను.

తే.ఆయమునకన్న నెన్నడునధిక మైన
వ్యయముచేయంగగూడదు; యాచకునకు