పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/846

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక

దిరుగవలయును, దేహంబుదృఢతగాంచి
యెపుడుదరుగంగపత్వంబునిచ్చుకొరకు.

ఆ.కల్మషోదకంబు గలిగించువ్యాధిని;

నిర్మలోదకంబు నిలుపుదాని,
దెలిసివడియగట్టుజల మె గ్రొలగదగు,
సౌఖ్యమండదలచు జనుడువినుడు.

తే.మితముతప్పింభుజించుట మేరగాదు;

మిగులగుడిచిన. నొడలికిదెగులుగలుగు
దనకడుపు నిండినను బంచదారనైన,
విషముభంగినిదలపోసి, విడువవలయు.

ఆ.రేయిపగలు మంచివాయువు వచ్చెడు

మాగములనుగలిగి, మందిరంబు,
పజ్జదెమ్మలేక, పరిశుభ్రమైయుండ
వలయునిత్యమును నివాసమునకు.

స్వతంత్ర జీవనము

తే.అన్నవస్త్రాదులకు నైన, వధికమైన

భోగభాగ్యంబులకునై నభూమిమీద
నొరులనేనమ్ముకొనియెప్డునుండరాదు;
తనదుచేతుల నమ్మంగజనునుగాని;

తే.పెద్దలాజించి, లోపలబెట్టిచన్న

ధనము ధాన్యంబుజోరులు తఱియెఱింగి,
తస్కరించిన, బోవునుదాచుకొన్న;
నవలవ్యధునిగతియేమియగునొకనుడు.

తే.పూర్వులుగడించిచునుమాన్యములునుమడులు,

పండకుండును; రాజులుపున్నుచాల