పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/803

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                 పధికవిలాసము 799

ఘనమగు గాలివానలన గంపిలుస్వీయసముద్ర సంపదల్,
తినినగిత్రాగి త్రుళ్ళుతనదీర్ఘనిశల్ , స్తుతియించు నెంతయున్. 17

చ.కరము నిరక్షభూమిని వగర్పు దిగంబరకృష్ణుదేహు ఁడున్
   వరుసగ సంస్తుతించు ఁదనబంగరువాలుకఁ, ద్రాటికల్లునున్:
   తిరుగుచు వేఁడియెండలను ,దేలుచు నుష్ణతరంగమందలిన్,
   స్మరణమొనర్చు వేల్పులఁగృతఙ్ఞతఁదానటుగన్న మేళ్ళకున్. 18

క.మనమెటఁదిగిరిన, నిటులుం
డును గద దేశాభిమానినుడువుపోగడ్తల్?
తన ప్రధమెత్తరదేశం
బనయంబును స్వస్ధలంబునందే యుండున్. 19


సీ.అయినను దేశంబులన్ని యు నొకవేళ
                      నొండొంటితో మనమొకటఁబోల్చి
    వానివానికిఁగల్గు భాగ్యవై భవముల
                            నిపుణంబుగఁబరిగణింతుమేని
    దేశాభిమానులు తివిరిస్తుతించిన
                        న్యాయంపుబుద్ధితో నరసిచూడ
     సర్వమానవులకు సమభాగముగ మేలు
                      పంచి యిఅఁబడినట్లె పలుకవలయు:

     కళలచేనొండెనుస్వభావకలననోందె
     వివిధముగనియ్యఁబడినవేఱ్వేఱుమేళ్ళు
      వివిధడేశస్ధ మానవవితతులకును
      సౌఖ్యనంపదలెల్లనుసమముజేయు. 20

 చ. ప్రకృతియు నెల్లరందు సమభావకృవల్ గలతల్లియయ్యునున్,
     సకలసుఖంబులిచ్చుఁగడుశ్రద్ధ మెయిం బనిచేయువారికిన్: