పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

కన్నుఁగవ నీరుకాఱంగఁ గదిసి యచట
నెల్లరు వినంగఁగర్ణుండు తొల్లి తనకుఁ
బ్రొద్దువలనను గలుగుట పొసఁగఁదెలిపి
యతనికిని వీళ్ళ విడువఁగ నతివవేఁడె.

ఉ.ఆప్పుడు గొంతిపెద్దకొడు కందఱమొందఱ నన్నకై కడుం
దెప్పరమైన నెవ్వగలఁదేలి వితాకునఁదల్లిదూఱుచుం
జెప్పెడి దేమి కర్ణునకుఁజేసెను నూవుల నీళ్ళపోఁతయుం
దప్పక కర్ణునిం దడవి తక్కినవారును గుంది రెంతయున్.

తే.పిదప మిన్నేటిగట్టునఁబెద్దదైన
గుడ్డయిల్లొండు గట్టించి గొంతికొడుకు
బుదుగులుఁజెలుల్ మొదలైనవారితోడ
మూఁడనెలలందు నిలిచెనుమురిపమెడలి

సీ.అచ్చోటి కొక్కనాఁడయ్యుధిష్టిరుఁజూడఁ
           గోరి వ్యాసుండును నారదుండు
కణ్వుండు లోనుగాఁగలిగిన జడదారు
             లరుదేర నెదురుగా నరిగివారిఁ
గొనివచ్చి మరియాద లొనరించి యందఱ
              నొగిఁబీఁటలను గూరుచుండఁబెట్టి
యడుగులఁబడి లేచి యందఱసేమంబు
               లారసి వేర్వేఱ యపుడు జముని

పట్టిచేదోయి జోడించి యిట్టులనియె,
నేను జచ్చిన వారికి నీళ్ళవదలు
నప్పు డమ్మ కర్ణుండు నాకన్న యంచుఁ,
జెప్పె నప్పటినుండియునొప్పదఱిఁగి.