క.ఆరేయి కృపుఁడు హితవుగ
రారాజును జేరిఁ చెప్పె రహి నిపుడైనన్
జేరి యుధిష్టిరు పొందుచును
గోరు మను చతఁ డతని పులుకులు వినఁడయ్యెన్. 140
సీ.శల్యుండు తేరెక్కి చనుదెంచి బూరంబు
రూపుదాల్చి నమాడ్కి నేపుచూపి
యేనుంగులను నెల్లబీనుంగులను జేసి
వారువంబుల నేలపాలొనర్చి
యరదంబులను గరం బఱవఱ లొనరించి
కాలిబంటుల జముప్రోలికంచి
పెక్కుతెఱంగుల నుక్కుచూపుచునుండ
వడముడి వడివడి వచ్చి తాఁకి
గుదియ చేకొని పెద్దయు నుదటుమీఱఁ
బోరి యాతని వ్రేల్మిడిఁ దేరిమీఁద
నొఱగఁజేసిఁ గృపుఁడప్పు డొద్దనుండి
తనదు తేరిపై నిడుకొని చనియెనతని. 141
తే.కర్ంఉకొడుకుల మూవుర గండడంచె
వకులుఁ డప్పుడు కుత్తుకల్ నఱికి వైచి
సురథఁడనువాని మార్కొవి సొంపుచెఱిచి
తలనుదునిమె నశ్వత్ధామములికిగముల. 142
ఉ.ఆవల శల్యునిం గవిసి యార్చి యుధిష్టిరుఁ డేపుచూసియుం
జేవచెడం బడల్పడియుఁ జెచ్చెరఁ దేరున సోలి యంతలో
నే వడిఁ దెల్వి నొంది తనయేటును బోటును జూసి శల్యుని౯
మావులఁ జంపి తేరు నుఱుమాడి కలంచెను వాఁడితూపుల౯. 143
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/680
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
