పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

కంటికాటుక నీటఁగందైన చెక్కుట
ద్దంబుల గందంబుదార్పవలదు
వలపుచీఁకటిబెంపువాసిన తుఱుము తేఁ
టులసంపెగల్చుట్టఁ దలఁపవలదు
బలువిరాళంపుఁగాఁకలఁ గందు చనునిమ్మ
పండులఁ గప్పురం బలఁదవలదు
దెసల నెల్లను బర్వుచు దిటముచెంది
పిక్కటిల్లుచు వెలుఁగొందు చుక్కల దొర
కాయు వేఁడివెన్నెలలందుఁ గలుకులార
పెట్టవలదు తామరకంటిఁ బెంపుమీఱ.

వ. అని యాచిత్రాంగదవంకం దిరిగి.

సీ. కై దమ్మి మోముచుక్కలరేని సెగఁగందం
జెక్కునఁజియ్యేలఁ జేర్చెదమ్మ
జార్కొప్పుచీఁకటిఁ జనుజక్క వలుగుందఁ
జానరో కురులేల జార్చెదమ్మ
నునుముక్కు సంపెఁగ నూగారుతుమ్మెదల్
బడలంగ మోమేల వాంచెదమ్మ
మినుకుకాటుకనీట నునుఁ జెక్కుటదముల్
మాయఁగన్నీ రేల పఱపెదమ్మ
చేయి దామరచెక్కునఁ దీయవమ్మ
ముంగురుల్ జాఱనీకమ్మ మోము మీఁది
కెత్తవమ్మ కన్నుఁగప నీరొత్తవమ్మ
పలుకువినవమ్మ లేవమ్మ పసిఁడిబొమ్మ.

గీ. గట్టువిలుకానినై నను గడియలోన! క్రిందుపఱుపంగఁజాలిన క్రీడియంత
వానికిని దుంటవిలుకాని బారిపడఁగ!నీకనినుఁగాచుటొకబరువేనెలంత.