పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చతుర్ధాశ్వాసము

గీ. నేటరేపట నిఁకమన నేలవేల్పు
     మన్నను జక్కఁబడునన్ని మానువెతల
     ననుచు ననబోఁడిఁ గడువేఁడి యందువలన
     నూఱట యెకింతగాన కయువిదమిన్న.

వ. తోడి చేడియలతోడ.

క. మునుకొని మరుఁడీకై వడి
      ననబోఁడి మెఱుంగుఁ జనుల నడుమనె పెడకుం
      జనకుండ గుఱిగనేయుట
      గనవింటికె కన్నులుండఁ గాఁబోలుఁజుఁడీ.

ఉ. చేతులు తమ్మితూండ్లనుచుఁ జేరినయంచలు కొప్పుజూచి వే
       బీతున నల్ల్ల మబ్బనుచు వెన్జనఁ, బంచిన గాలినారు పా
       మే తఱుమంగఁ బువ్విలుతుఁడేమిటఁ జామనుగెల్వలేమిఁద
       ర్వాత నెమళ్ళఁగూర్చెఁ బగవానికొమారుని వారువంబులన్.

వ. అనిచెపి యప్పుడు చెవులుచిల్లులువడఁ గడుఁగూయు కోయిలలు
      మొదలయిన వానింగూర్చి పేర్చిన కినుక పెంపున నిట్లనియె.

సీ. బరులవంచలఁజేరి యున్నట్టికోయిలా
యెందుకునీకింత యెరిగిపాటు
నిలువఁజటునులేక నింగివ్రేలెడు చంద
మామ నీకేలద్రిమ్మరితనంబు
చచ్చిచావనివాని చాడ్పుననున్నట్టి
మరుఁడనీకేటి కీమండిపాటు
కదిసికొమ్మలపాల బ్రదుకఁగాంచిన తుమ్మె
దా యేల నీకింతయదరిపాటు
మీకుమునుబోలె నిపుడు మామెలతతోడిఁ
యొక్కమాటనుంటయును మోమోటమియును