పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

<poem>గ్రాల్గంటి నెఱసోయగముఁజూడఁగాఁగోత నొండేదికన్ను లకొప్పడయ్యెఁ దలిరుబోఁడి నెమ్మెయి మెత్తతనముఁగోర నొడలికిని బడదయ్యెఁవేఱొకటిసోఁక నేమిచెప్పుదుఁ గవ్వడియింతినొక్క దానిఁదక్కంగ మఱి యున్న వానిమఱచె.

గీ. ఇట్లునెలఁతమీఁది యెదఁద్రిప్పకొనలేక యలరుఁదోట కేగనన్ని యచటఁ జక్కఁబడునటంచుఁజనియెఁబూఁదోఁటకుఁ జెలులుకొందఱవలఁజేరిరాఁగ.

సీ. బలుమల్లెమొగ్గలు పలుచాలుదలఁపించుఁ దుమ్మెడల్ కురులచెల్వమ్ముఁజూవుఁ జిగురుటకులు కేలిచెలువంబు వెలయించు నేనుఁగుల్నెన్నడ నెన్నఁజేయు దొండపండులుమేవి నిండుచెల్వముఁజెప్పు నంపంగిననముక్కు పెంపునుడువు నరఁటిచెట్లు తొడలయందమ్ముఁగాంపిచు జిలుకలుపలుకుల చెలువుఁదెలుపుఁ దానరూపును మఱపంగఁగానకేగఁ దెఱవరూవుఁదక్కఁగ నన్నిమఱచిపోయెఁ దప్పునే తానొక తెఱంగుఁదలచుకొనంగ దయ్య మొండొకతెఱఁగుఁదాఁదలఁచుననుత.

ఉ. కమ్మని తెమ్మఁదెమ్మెరలు గ్రమ్మఁగఁ గమ్మనివింటిదంట వూ వమ్ములు చిమ్మ జుమ్ముమని యామునఁ దుమ్మెదదిమ్ముద్రిమ్మరన్