Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

గీ. అదియటుండనిండిఁక వేగనరిగి యచటఁ
       బల్కుపూబోడగాంచి పల్కులాడి
       మరలిరావలెఁగావున మాకునివుడ
       సెలవొసంగుము పోయివచ్చెదమటన్న.

వ. ఆవలంతి చిలుక మేలుబంతుల కాతండిట్లనియె.

గీ. తొలుతనేలకుడిగ్గుచుఁ ద్రోవలోన
       దవ్వులను మనమనుకొన్న దానికితఁడ్
       తిగును జెలియరో యంటివి దారిలోన
       నేమిచెప్పుకొంటీరి దేని కేనతగుదు.

గీ. అయ్యదిటువంటిదనిచెప్ప ననువుపడినఁ
       గొఱఁతవెట్టక యానతీఁగూడుననిన
       నలువలంకలుఁ దిలకించి చిలుకకలికి
       కలికిపలుకుల వలవులు చిలుకఁబలికె.

గీ. మంతనంబున మాటాడు మాటయదియుఁ
       బలుకవచ్చునె యౌనుగా మంచితఱియు
       నెవరుపెఱవారు లేరుగా యిందులోన
       నన్నమనవారలెగదయీయున్నవారు.

వ. అనిన నతందు.

గీ. కలికిచూపునఁ గొలువెల్ల గలయఁజూడ
      నేకతముగోరు నన్నగా నెల్లరెఱిఁగి
      చూపుతోడన వడిలేచి చుట్టునున్న
     తోడివారలు దవ్వులఁ దొలఁగిచనిరి.

వ. అంత మఱింత చెంతకుంజరగి ఱేని మొగంబునన చూపునిలీపి ముద్దులు గులుకు కలికిపలుకులు వీనులకువిందుగొలుప నాచిలుక యల్లన నిట్లు చెప్పందొడంగె.