పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


గీ. తడయ మీపనియేమైనఁ జెడునొయబుచు

      నిపుడు మిమ్మింతగా వేగిరిపవలసెఁ
      గాని మీచెల్వు కన్నారఁగాంచుచున్న
      నెంతసేపైనఁ జూడనే యిచ్చవొడము.

చ. అనవిని చిల్కపల్కు నిటకారయ మేమరుదెంచుటెవ్వరిం

      గనుఁగొని మాటలాడనయ! గట్టిగ దేవరవారితోడనే
      మనవియనర్ప వచ్చితిమిమామదిఁగల్గినదెల్లఁ బై నము౯
      జనుటయె కర్జమైనఁ జనఁజాలము నీకొలువింతసేయఁగన్.

క. ననుమీరడిగిన దంతయు

      వినుఁడిఁక వినుపింతుమీకు వేడుకమీఱం
      గను మంజువాణియందురు
      నను నాచెలియె మృదువాణినాఁబడు నిదియు౯.

సీ. చిత్రవాహనుఁడనఁ జెలఁగుచుండెడు ఱేని

                                       వినియుందురాతని వీటినుండి
      పలుకుచేడియఁజూడఁ దొలివేల్పు జగమున
                                        కేగుచునున్నార మెలమితోడ
     ఱెక్కలునిమురుచు మక్కువవెలిచెన
                                         చక్కెరతినిపించు చక్కుఁజేర్చి
     తనబిడ్డలుగనెత్తి తడవుగనిన తల్ల్లి
                                         నెలెఁ బెంచుచుఁదనంతీవారిఁగాఁగ
    నొద్దఁగూర్చుండఁనెట్టుక ముద్దుచేతఁ 
    జనువుమీఱంగ నామెయె చదువుచెప్పి
    చక్కఁ దిద్దుకొనియెఁగానఁ జదువులెల్ల
    నొనర నఱచేతినివై యుండుమాకు.