పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


క. ఎప్పుడుఁబూవుందోఁటల
నొప్పగుతావులకుఁజిక్కియొగిఁజలిగాడ్పుల్
తప్పక కాపురముండఁగ
మెప్పొదనఁగఁ జలువలచట మేకొనియుండున్.

చ. వలపులుమీఱనీఱములఁ బ్రాఁకుచుఁ దమ్ముల మొత్తపున్శిరుల్
తొలుతను వెచ్చపెట్టి పువుఁదోఁటను మోవులుతావులాని పె
క్కులు గలిగింతలందనరి కొమ్మలనిమ్ములఁ గూడివీటికిం
దెలదెలవాఱువేళఁ జనుదెంచును దెమ్మెరదంటయల్లన న్.

ఉ. వేలుపుఁమాని క్రొవ్విరుల పెంవలపుల్ గొని విన్ను వాఁకపైఁ
దేలుచు దానిచల్వయును దెమ్మెరతెచ్చియొసంగి చెమ్మటల్
దూలఁగఁజేయునిద్దరను దోఁగిమగల్ జవరాండ్రువేకువన్
హాళినిమేలుకాంతురట నచ్చరబోటుల వీణెపాటాలన్ .

చ. అలయెలదోఁట మొత్త్తముల యందలిఁమాఁకుల పూవుఁదేనియల్
వెలువడి చేలకాలువల వెంబడిఁబాఱుచు నూరిపైరులం
బలువిడిఁ బండఁజేయఁగని మబ్బులుసిబ్బితి డాగనిచ్చలుం
బొలుపగుతావితో సగళునున్ బొగ లాడఁగఁజేయునెమ్ములన్ .

చ. ఎనమఱిలేక ప్రొఁజదువులెల్లను నేర్చుటెకాని లాఁతిచే
తను దలకొట్లనొందెనని తామరచూలిని దూఱి వేయునో
ళ్ళను దుదముట్టఁగాఁ జదువులంగనుటొక్కటె రెండు నాల్కలం
చొనరఁగఁబావఱేని నగియుందురు ప్రోలిని నేలవేలువుల్ .

సీ. చెవులెకన్నులుగాక దవునేలదాల్చరుల్
పలునాలుకలులేని పజదొరలొక
పగవానిఁగనిపాఱి బలుకొండకలుగున
డాగనిపసిఁడిపుట్టంవుదాల్పు