పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

తే.గీ.ప్రోలిహొంబట్టు టేక్కెంపుగాలియడిరి
ప్రొద్దుతేజీలనవ్వలఁ బోవకుండ
నాపఁగాఁగాదె తనతేరికతఁడుకట్టెఁ
బాముగుంపులఁజెలువంపుఁ బగ్గములుగ.

ఉ.చొక్కపుఁబైడిమేడలను సొంపగు పచ్చలచూరుపట్టెలం
   జెక్కినకప్పుఱాలపని చిత్తరువ్రాఁతల పారువంబుల౯
   దక్కెన్నటంచుఁ బట్టుకొన దగ్గరఁమాఁకుల నుండుడేగచాల్
   నిక్కుచు నంతదవ్వెగయ నేరక క్రమ్మఱివచ్చు నిచ్చలున్.

ఉ.ప్రోలికడాని మేడగమిఁబొందుగఁజెక్కినయట్టి పుల్గురా
   ఱాలమెఱుంగు రంగులతెఱంగుఁ గనుంగొని త్రోవకడ్డుగాఁ
   జాలెడుపచ్చికంచు నెదఁజందురుఁడెంచియె దానిమేయఁగాఁ
   దాలిచెనిఱ్ఱిఁగానియెడఁ దాల్పఁగ నాతనికిఱ్ఱియేటికిన్.

చ.నెలయరుదెంచి యుప్పరిగ నిద్దపుసోరణగండ్లు సొచ్చిన౯
   వెలఁదులులేచిచూచి కడువేడ్క మెయిం దమ కేలుదమ్ములం
   దలుపులుమూయఁగట్టువడి తద్దయుసేపట నేలనుండఁగాఁ
  గలుగుటఁజుమ్ముపొల్చె నెలకట్టులనంగను నేలలెంతయున్.

గీ.తద్దయును వేలుపులఱేని దాడికోడి
  గుంపులనుగూడి పఱతెంచి కోర్కులలరఁ
  గడలిడాగవచ్చిన కొండగమియనంగఁ
  గదిసితిరుగు నేనుంగులగడ్తయందు.

క.వీటనుగలగుఱ్ఱంబుల
  గాటపువడికోడిగడ్డి కఱిచెను లేడుల్
  మాటికిపడఁకుచు గాలియుఁ
  బోటరితనముడిగి యొక్కమూలంబడియె౯.