Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

త్రిజ- ఓమునీంద్రా! నేనడిగినదానికి ప్రత్యుత్తరముచెప్పక మౌనము ధరించియూరకిన్నావేమి? శ్రీఘ్రముగా సమ్మతిని తెలుపునదుత్తరమును జెప్పుము.


సత్య-నేనేమనియుత్తరముచెప్పగలను? వారు మహషులును దేవతలునయినందున వారికెట్టి పనికయిననుసామర్ధ్యముకలిగినది. మనిష్యమాత్రుఁడనయిననాకెట్లుకలుగును?

త్రిజ- నీవునిజముగా మనుష్యుఁడవయినను సందేహింప వలసినపనిలేదు. రాక్షసస్త్రీలను వివాహము చేసికొన్నమనుష్యులును మీలోననేకులున్నారు. భీముఁడు హిడింబయనురాక్షసితో సంభోగించి ఘటోత్కచునిగనెను.ప్రద్యుమ్నుఁడు వజ్రనాభదైత్యునికూఁతురైన ప్రభావతిని బొందిపుత్రునిగనెను. అనిరుద్ధుఁడు బాణానురపుత్రియైన యుషాకన్యనువరించెను.ఇఁక మాఱుమాటాడకస్థూలరూపమును ధరించినన్ను కృతాధురాలిని జేయుము.కామరూపములను ధరించి యిష్టకామోపభోగములను పొందిన మీఋషుల మహిమలు నాకపారముగాఁదెలియును.

సత్య-పూర్వకాలపు మహర్షులవద్దనే కానియిప్పటి వారి కటువంటిశక్తులులేవు. కామరూపమును వహించు సామర్ధ్యము నావద్దలేదు.

త్రిజ-నీమాటనేనునమ్మను; ఆలస్యముచెసి స్త్రీహత్య కొడిగట్టక స్థూలరూపమునుపొందుము. తెల్లవాఱఁబోవుచున్నది.మంచిమాటలచేత నాప్రాధననువివనిపక్షమున బలాత్కారముగానైన నామనోరధము తీర్చుకొనెదను కొన్నిదినముల క్రిందటనీవుదీఘరోమునిగర్భములోఁ జొచ్చివెక్కసముగా పెరిగి పొట్టచీల్చుకొని పయికీవచ్చినకధనేను వినలేదనుకొన్నావా? ఇఁకనావద్ద నీమాయమాటలు మాని నీకామరూపమహిమచేత స్థూలాకారమును ధరింపుము.