పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/335

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

మన్న యావ్రేళ్ళనడుమ నడకొత్తులోని పోకలాగున నిఱుకుకొని బాధపడిచు పయిపంకఁ జూచునప్పటికి వాని ముఖమప్పుడు సమీప మున నాకు మఱింత స్పష్టముగాఁ గానఁబడినది. తెఱచియున్న వాని నోరు వర్వతగుహవలె నున్నది; నాలుక గుహలోనుండి పయికీవెడలు చున్న కొండచిలువ వలెనున్నది; దంతము లా కొండ చిలువను పట్టుకొ నుటకయి చాలువుగావచ్చి ముక్కులుచాచిక్రిందను మీఁడను గుహా ముఖమున నిలుచున్న గరుడ పక్షులవలె నున్నవి. ఆస్ధితిచూచి నప్పు డా రాక్షసుఁడు గుటుక్కున మింగుటయి నోర వేసికొనఁ భోవు చున్నాడని భావించి, ఆక్రూర కృత్యమును చూడలేక మొగము వెనుక ప్రక్కకు త్రిప్పుకొన్నాను. అట్లు మొగము త్రిప్పు కొనఁగానే ముల్లువుచ్చి కొఱ్ఱడచినట్లు వొంటికంటెను గోరంతమైన వికృతరూప మొకటి నాకన్నులను వెఱపుగొలువుచు నావెనుకతట్టున నిలువఁగానే యున్నది. మొదటి రాక్షసవిగ్రహ మీనూతన రాక్షస విగ్రహము బెట్టుకొనియున్న యారాక్షసవిగ్రహము దానిముందు కేవలశిశుప్రాయ మయినది. మొదటి రాక్షసవిగ్రహ మీనూతన రాక్షసవిగ్రహము మొలవద్దకయినను రాలేదు. మొదటి విగ్రహముకంటె మూఁడంత లున్న యీవిగ్రహ మెంతపెద్దదిగా నుండునో దీనిని చదివెడివారే యూహించుకోవచ్చును. నమస్తాపయనములును మొదటి గ్రహమున కున్న దానికంటె మూఁడేసిరెట్లున్నవి. ఆవిగ్రహముయొక్క మొగము చూడవలెనని నేను తలయె త్తితినిగాని దేవాలయములోని గాలిగోవురము యొక్క శిఖరమువలె నున్నయాతనిశిరస్సు తిన్నగా కంటికి కనఁబ డినదిగాదు. అడవిపంది యొక్క వెన్నుమీఁది నిడుదనెండ్రుకలవలె నున్న యాతని కడుపుమీఁద నూగారు నడుమ నాదృష్టి కడ్డమునచ్చి బెదరింపఁగా క్షణకాలము తొలఁగిపోయిన భయదేవత మరలవచ్చి నాహృదయములోఁ బ్రవేశించి నాకన్నులను మూఁతవేసినది; అంగ