పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/336

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

ముల నల్లలనాడించినది ; మొగమును వెలవెలఁబాఱించినది; ప్రాణము లను బాఱఁదోలి శరీరము నంతను మరల వివశముచేసినది. ఇట్లు కొంతసేపు మరలమూర్చపోయి రెండవసారి తెలివి తెచ్చుగొని కన్నులు విచ్చి చూచునప్పటికి నేను మొదల ననుకొన్నట్లుగా పయికి పిన్న రాక్షసుని నోటిలోనికిఁబొక క్రిందికి భూమీఁదికి వచ్చి యున్నాను. అప్పుడు భూమిమీఁదనున్న నన్నాయిరువురు రాక్షసులును మాళ్ళ మీఁద గూరుచుండి వంగి నాయవయవములను శోధీంచి చూచుచు న్నారు. ఆసమయమునందు నేను కదలి భూమిమీఁద నడువనారంభిం పఁగా వారు సంతోషించి తమలోతామేమో చెప్పుకొనినన్ను మరల చేతులతోఁబట్టి మనదేశము నందు పిల్లలు పక్షిపెల్లలను బట్టలలోఁ బెట్టుకొని తీసికొని పోవునట్టు నన్ను తమ బట్టలలోఁ బెట్టుకొని మఱి యొక యింటికిఁ గొనిపొయి వాకిట బల్లమీదఁ గూరుచుండి చదువు కొనుచున్న మఱియొక రాక్షసుని జూచి నమస్కరించి యాతనితో నేమేమోచెప్పి మెల్లగా నన్నాతని బల్లమీఁదఁ బెట్టిరి. ఆతఁదును నన్ను మొట్టమొదట తన చేతిలోనున్న పుస్తకముతో మెల్లగా కద ల్చిచూచి, కొంతసేపు నామొగమువంకను చేతులవంకను వంగిచూచి యాశ్చర్యపడి, పురుగును కఱిచిపోవునేమోయని భయపడి మనము నేర్పుతో పట్టుకొనునట్లు మెల్లగా తనచేయి నానడుము పట్టుకొని సాహసించి చటుక్కున ముందఱి వ్రేళ్ళతో నానడుము పట్టుకొని పయికెత్తి, వెల్లవెలికిలఁబట్టి మొగము చేరువను బట్టుకొని కొంత సేవునన్ను నిదానించిచూచి చిఱునవ్వునవ్వి, నన్ను మెల్లగా మరల బల్లమీఁదఁ బెట్టెను. కఱుతునో కుట్టుదునోయన్న భయమొ చేత నన్నతఁడు గట్టిగా పట్టుకొన్నందున వ్రేళ్ళయొత్తుడుచేత నానడుము నలిగి తరువాత మూఁడు దినములవఱకును నా నడుమునొప్పి పోయి నదికాదు.