పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్లో. :: తిస్రఃకోట్యర్ధకోటీచ యానిలోమాని మానుషే

తావత్కాలం వసేత్స్వర్గే భర్తారం యానుగఛ్చతి.

అని భర్త తోడ సహగమనము చేసిన పుణ్య స్త్రీ మనుష్య దేహమున నెన్ని రోమములుండునో యంతకాలమనగా మూడుకోట్ల యేబదిలక్షల వేలయేండ్లు స్వర్గసుఖమును పొందునని చెప్పబడినదనియు, "యానిలోమానుమానుషే తామత్యబ్దసహవ్రాణి" యని హరీతుడికూడ స్పష్టముగా జెప్పినాడనియు అంగీరస స్మృతియందు

శ్లో.:: బ్రహ్మఘ్నోవా కృతఘ్నోవా మిత్రఘ్నోవాసి మానవః

తంవై పునాతి సానారీ ఇత్యంగీరసభాషితం .

అని సహగమనము చేసిన స్త్రీ భర్త బ్రహ్మఘ్నుడయినను కృతఘ్నుడయినను మిత్రఘ్నుడయినను కూడ నతనిని పవిత్రుని జేయునని చెప్పబడినదనియు, అందుచేత శాస్త్రనిహితమైన యీ యాచారమును నిషిద్ధమని చెప్పగూడదనియు, ఆస్తికులయిన వాఱందరును శాస్త్రప్రమాణమును శైరసావహించి యల్పమైన మనుష్యబుద్ధికి క్రూరముగా కానబడినను తప్పక యనుష్ఠింపవలసినదనియు, నింద్యమైన యాచారమును సిష్టులయిన మావారంగీకరించియుండరుగనుక తప్పక యిది సదాచారమే యనియు నేను నొక్కి చెప్పినాను. అందుమీద నతడు కొంచెముసేపాలోచించి స్వప్రయోజనపరులైన మనుష్యు లెవ్వరో యేవోకారణములచేత నట్టి శ్లోకమును కల్పించితుందురని పలికెను. నేనామాటల లొడబడక యవిమనుష్య కల్పితములగుట సాధ్యముకాదనియు, మనుష్య కల్పితములైన పక్షమున,

"నమోద్యాముకే మాసి అముకేపక్షేముకతిధౌ అముకగోత్రా
శ్రీమతీ అముకీదేవీ అరుంధతీ సమాచారత్వపూర్వక స్వర్గలోక
మహీయమానత్వ మానవాధి కరణ లోమసమ సంఖ్యాబ్దా
వఛ్ఛిన్న స్వర్గవాస భర్తృసహిత మోదమానత్వ మాతృపితృ