శ్వశురకులత్రయపూతత్వ చతుర్ద శేంద్రావఛ్చిన్న కాలాధికగణకా ప్సరోగణస్తూయమానత్వ పతిసహిత క్రీడమానత్వ బ్రహ్మఘ్న కృతఘ్న మిత్రఘ్న పతిపూతత్వ కామా భర్తృజ్వలచ్చితారో హణ మహంకరిష్యే"
అని సమ కల్పమేల పుట్టెననియు, మొట్తమొదట దీఇనికొక్కదానికి నాకు సమాధానము చెప్పవలసిన దనియు, నేను కోరితిని ఆసంకల్పమున కర్ధమేమని యతడు నన్నడిగెను. "నమస్కారము. నేడు ఈమానమున ఈపక్షమున ఈతిధియందు ఈగోత్రములగట్టియు ఈపేరుగలట్టియు శ్రీమతినైన నేను అరుంధతివలె నడుచుకొనుటవలన గలిగెడు స్వర్గలోకమహిమను పొందుటకును , మనుష్యశరీరమునం దెన్నిరోమములుండునో యన్ని సంవత్సరములు భర్తతో గూడ స్వర్గవాససుఖ మనుభవించుటకును, తల్లియొక్కయు తండ్రి యొక్కయు మానుగారియొక్కయు మూడు వంశములను పవిత్రముచేయుటకును, పదునలుగురింద్రులకాలమువఱకును అప్సరోగణముల స్తుతిని పొందుచు పతి సహితముగా క్రీడించుటకును , బ్రహ్మహత్య చేసినవాడయినను కృతఘ్నుడయినను, మిత్రద్రోహి యయినను భర్తను పవిత్రుని చెయుటకును, కోరి, మండుచున్న భర్తయొక్క చితినెక్కెదను" అని పై సంకల్పమున కర్ధమని నేను విఅవ్రముగా బోధించినాను. అర్ధము వన్న తరువాత సహితము మాయుపాధ్యాయుడు సహగమనము మంచి కార్యమని యొప్పుకొనక యిట్టి సంకల్పమును కొంచెము సంస్కృతము చదువుకన్నవారెవరైనను కల్పించ వచ్చునని సమాధానము చెప్పెను. ఇది కల్పన కాదనియు, ధర్మసాస్త్రములలో
"శ్లో. మృతేభర్తరి యానారీ సమారోహేద్ధుతాశనం సారుంధతీ సమాచార స్వర్గలోకే మహీయత."
అనియు,