పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము

మంత్రమలను ప్రయెాగోపసంహారములహతోను అంగన్యాస కరన్యాసములతోను రహస్యముగా నుపదేశించెదను.

అటు తరువాత మంచి పాండిత్యము సంపాదించె మాయజమాను రాలిగారి కోరికప్రకారముగా నేను పాఠశాలయందు ప్రవేసించాను. మఱియొక పురుషుఁడు కూడా పాఠశాలయందు చేరి నాకు సహపాఠియయి మిత్రుఁడయినాఁడు. మేమిద్దఱమును రహస్యముగానాలోచించుకొని యాదేశమునందలి పురుషుల కెలాగునైనను స్వతంత్రత్వము కలుఁజేయుటకు సర్వవిధములు ప్రయత్నము చేయవలెనని యొవ్వరికిని దెలియకుండ మాలోమేము ప్రమాణములు చేసికొన్నాము. స్త్రీలను లోఁబఱుచుకొనెడు నులభోపాయము నాకు తెలియును గనుక, మన కొక్కోకమునంగుఁ జెప్పబడిన "ఓం–కృష్ణాంగి–కృష్ణ ముఖ–పుష్పందాస్యామి– వశ్యమానయది–నభవతి–బ్రహ్మరుద్రాభవతి–స్వాహ్స్" అను పశీకరణ మంత్రము నేనాతనికి గురుదక్షింఅలేకుండ నుపదేశించి , దీనిని పదిలక్షలు జపించి పునశ్చరణచేసి తెల్లని పువ్వులు మంత్రించి స్త్రీలమీఁద చల్లవలెనని చెప్పినాను · గురుదక్షిణ లేకపోవుటచేత కాఁబోలను  ! ఈ మంత్ర మంతగా పనిచేసినదికాదు ·ఎట్లయినను మనమంత్రము లదేశపు మంత్రనులకు చాలవు . అందుచేతనే మనవారు మళయాళమంత్రములని గొప్పగా చెప్పుదురు. నేను పాఠశాలలో ప్రవేసించినది మొదలుకొని జరిగిన విశేషములను తెలుపుటకు ముందుగా దేశస్తుల యాచార వ్యవహారములను గూర్చి కొంత చెప్పుట యుక్తమని తలఁచు చున్నాను.

ఆ దేశమునందు స్త్రీలే సర్వస్వతంత్రురాండ్రనియు , పురుషులు వారి కాజ్ఞానువర్తులయి మెలఁగవలసిన వారనియు , నేనీవఱకే చెప్పియున్నాను . మన దేశమునందాఁడువారికి వలెనే యాదేశమునందు మగవారికి విద్యచెప్పింపరు . మనదేశము నందలి భోగస్త్రీలవలె నాదే .