పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

పూర్వపు పత్నీభక్తీ తగ్గు చున్నది. స్త్రీలిప్పుడు పురుషుల మటలే విసమొదలుపెట్టినారు.

ఈకడపట చెప్పన వాక్యములచేత నాకు కొంతసంతోషముకలిగింది. ఇక్కడ కూడ స్త్రీ లిప్పుడు పురుషుల మాటలనే , వినుచున్నారు గదా? వినుటయో స్వభావసిద్దము; వినకుండుటయే స్వభావవిరుద్దము. ఈయాలోచలన్నియు నామనస్సులో పుట్టినను, ఆమమే మనస్సు నోచ్చునని నేను పయికవలేను . ఈప్రసంగ మయిన తరువాత నేనామెకు భక్తతో నమస్కారించి నాకామంత్రముల నుపదేసింపక తప్పదని పాదములమిఁదపడి లేచినాడనుగాను. అప్పుడుపదేశీంచుటకు సమయము కానందున మరియొకప్పుడుపదేశీంచెదని చెప్పి, కొన్ని దినములయిన తరువాత నేనుమూఁడు వవాసముచేసి స్నానముచేసి ళుచినయి యమా వాస్యనాడు ప్రాత౯కాలమున పోయి సందర్సనము చెసికొని పాదప్రణామము చేయఁగా నాకామె వశీకరణ మంత్రము మొదలైన మహా మంత్రములను పెక్కింటిని ఉపదేశించినది. ఆమెనాతొచెప్పకపోయినను నేనీమంత్రములను మనదేశపు స్త్రీలకు చెప్పుదునను భ్రమతో నాకామె మఱి౦త ప్రీతి పూర్వకముగా నుపదేశించినట్టు నేను కనిపెట్టినాను. కాని నేనట్టిపని యెన్నడైనను చేయుదునా? ఈమంత్రముల నిందు ప్రకటించి మీకుపదేశించి యుందునుగాని , ప్రచురపఱిచిన పక్షమున స్త్రీలుకూడ గ్రహించి యీదేశమునందువలెనే మనదేశము నందుగూడా వారు పురుషులను తమకు దాసునులుగాఁ జేసికొందురేమోయను భయముచేత నేనిందు ప్రకటింప సాహసింపకున్నాను. ఓహిందూమహాజనులారా  ! దీనినిబట్టి నాకు మీయందనురాగము తక్కువపడినదని మీరెంచబోకుడు. నాదగ్గరకువచిన పక్షమున స్త్రీలకు చెప్పమని మీచేత ప్రమాణములు చేయించుకొని మంత్రసిద్దికొరకు మీవలన గురుదక్షిణలను స్వీకరించి మీకొక్కరికే సర్వ.