పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము

ఆరహస్యము కూడ నాకు సెలవిచ్చి మూఢుఁడనయిన నన్ను కృతాధుకాని చేయవలెను. మీశఘ@ండ నయినతరువత నాకు తెలియనివిషయ ముందఁగూడదు.

ఆది పరమరహస్యమముమే యయినను భక్తిశ్ర్యద్దలు కలవాఁదవగుట చేత నికుమర్మమువిడిచి చేప్పెడను. స్రిలు పురుషులమీఁద నధికారము చిఅల్లించఁ గలుగుటకు ప్రధానకారనము మంంత్రబలము , ఎంత బలవంతుననై నను లోఁబఱచుకొని దాసునిజేసిక్కుక్కవలె ఆడింపఁగలశక్తి మావద్దనునది.

ఆదిసత్యము, ఆశక్తి స్రిలవద్ద తప్పక యున్నది. సర్వ స్వతం త్రులమని చేప్పకొనుచున్న మాదేశమునందు సహితము పురుషులు స్త్రీలకు దాసులయి వారు చెప్పినట్లే నడుచుచున్నారు . సంస్కారకత౯ల మని పేరుపెట్టుకొని సభలలో పులులవలే నఱచెడు మాదేశమునందలి నవ నాగరిక పురుషులు కూడా పౌరుషహీను లయి ఇంటివద్ద భర్యలముందు నోరెత్తలేక పిల్లులవలే నొదిగొయుండి తాముచెప్పినట్లు భార్యలను నడిపింపలేక భార్యలు చెప్పినట్లె తాము నడుచుకొనుచున్నారు.

ఆలాగుననా? ఈమాట యింతకుముం దెప్పుడును చెప్పినావుకావేమి ? మిదేశమునందు పురుషులు స్వతంత్రులన్న నేనేమోయనుకొన్నాను. ఇప్పుడు నిజముతెలిసిపోయినది. మొదటినుండియు నీ మాటలయందు నాకెప్పుడును నమ్మకములేదు. నాదేశమునందువలెనే మీదేశమునందున పురుషులే స్త్రీలకు లోఁబడియున్నారు. మేమే స్వతంత్రులమని పయి కెవ్వరెన్ని వేషములు వేసినాను , ఈశ్వర సంకల్పమున కెన్నఁడయిన బికల్లము కలుగునా? ఈనవనాగరికుల మూలమున మాదేశవిప్పుడు కొంతకొంత చెడిపోవుచున్నది. ఇప్పటిపురుషులకు.