254
హ్మణునకు రెండణాలు దక్షిణయిచ్చి ,అక్కడసంగతుల నడుమ నారంభించితిని.కొంతసేపు సంభాషణము జరిగినతరువాత మీరెక్కడకు పోవుచున్నారు? అని నన్నతడడిగెను.ఉడిపి సుబ్ర్హ్మణ్యము మొదలయిన యాత్రలు సేవిపబోవుచున్నాను అని నేను చెప్పితిని.అప్పడాబ్రాహ్మణు డెన్నో నీతివాక్యములు చదివి ,తన దేశములోని వారినందరను మెాసగాండ్రనియు తోడులేక యొంటిగా ప్రయాణముచేయుట యపాయకరమనియు మళయాళదేశములో చిత్రవిచిత్రము లెన్నియెా యున్నవనియు తనతో గూడ వచ్చినపక్షమున వానినన్నిటిని నాకుజూపి నన్ను సురక్షతముగా మరల తీసికొనివచ్చెదననియు చెప్పి యొప్పించి ,నన్ను పొగబండిమీద ప్రయాణముచేసెనుపొగయెాడఖర్చులు మొదలయినవానిక్రింద నాకీవరకయిన పదునెనిమిది రూపాయలుపోగా నావద్ద ఇప్పడెనుబదిరెండు రూపాయలున్నవి.వానిలో నాలుగురూపాయల పదణాలు నాకునుమరినాలుగురూపాయల పదణాలు బదులుక్రింద తనకును మొత్తము తొమ్మిది రూపాయల రెండణాలు నావద్దవుచ్చుకొని మా బ్రాహ్మణుడు తుత్తి కూడికి మూడవతరగతి టిక్కెట్లు రెండు తెచ్చెను.మరునాటి యుదయమున ఏడుగంటలపావునకు మేమిద్దరమును జాబులుకొనిపోవు పొగబండిలో నెక్కి యెళంబూరునుండి యినుపదారిమీద బయలుదేరినాము.బయలుదేరునప్పడు బండిలోకూరుచుండి మాబ్రాహ్మణుడు రాహుకాలమెప్పడని నన్నడిగెను.రాహుకాలమేమెా నాకుతెలియదని నేను చెప్పితిని.రాహుకాలములో ప్రయాణము బయలుదేరరాదని యతడనెను.మాదేశములో రాహుకాలమని పట్టింపులేదు వర్జ్యసమయమునమాత్రము బయలుదేరరని నేనంటిని.మీయుత్తరదేశపువాళ్లేమియు తెలియని మూఢులని యతడనుచుండెను.ఇంతలో మేమెక్కిన పొగబండి కదలి నడువ నారంభించెను. మా బ్రాహ్మణుడు
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/254
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
